అక్షరటుడే, బాన్సువాడ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అవినీతి జరిగిందని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం వర్నిలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత బాన్సువాడ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.