అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆర్​బీఐ మాజీ గవర్నర్​ శక్తికాంత్​దాస్​ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శక్తికాంత్​దాస్​ తమిళనాడు క్యాడర్​కు చెందిన 1980 బ్యాచ్​ ఐఏఎస్​. 2018 డిసెంబర్​లో ఆర్​బీఐ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టి గతేడాది రిటైర్డ్​ అయ్యారు. తాజాగా ప్రధాని ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.