అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో ఆయన చేరారు. కానీ సిర్పూర్లో నేతల మధ్య గొడవలతో కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.