అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : మాక్లూర్‌ మండలంలోని లక్మాపూర్‌ వద్ద నిర్మిస్తున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు సూచించారు. బుధవారం అధికారులతో కలిసి పనులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లిఫ్ట్‌ పనులు పూర్తయితే బొంకన్‌పల్లి, ముల్లంగి గ్రామాల రైతులకు ప్రయోజకరంగా ఉంటుందన్నారు. ఆయన వెంట నాయకులు లక్ష్మణ్, శ్యాంరావు, రమణగౌడ్, రమణారావు, గోపాల్, అమృత్, సంపత్‌రావు, గంగారాం, సాగర్‌ రావు, సుదర్శన్‌ రావు. ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు.