అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్‌ షాక్‌తో నలుగురు యువకులు మృతి చెందారు. ఈఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో చోటుచేసుకుంది. మృతులను గ్రామానికి చెందిన బల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణగా గుర్తించారు. గాయపడ్డ కోమటి అనంతరావును తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణకు సంబంధించి ఏడాదిన్నరగా రెండువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల ఇరుపక్షాలతో చర్చించిన కొవ్వూరు సబ్‌కలెక్టర్‌ రాణిసుస్మిత అనుమతి ఇచ్చారు. ఈరోజు ఉదయం సినీ నటుడు సుమన్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. అంతలోనే ఈదుర్ఘటన చోటుచేసుకుంది.