అక్షరటుడే, జుక్కల్ : ఉమ్మడి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ ల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు చుక్క నీరు ఇన్ ఫ్లో లేని నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద నీరు వస్తోంది. ప్రస్తుతం డ్యాంలోకి 385 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1387.52 అడుగుల(3.180 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 14,063 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80 టీఎంసీలు) గాను ప్రస్తుతం 1067.10 అడుగుల (18.833 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.