అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్ర విభజన హామీల్లోని మరొకటి నెరవేస్తూ.. తెలంగాణకు రైల్వేశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్‌హాలింగ్‌ వర్క్ షాప్ ను మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాజీపేటలో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది.