అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటించిన గేమ్‌ ఛేంజర్‌ కలెక్షన్లలో దూసుకుపోతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్లు సాధించింది. పండుగ సెలవులు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.