అక్షరటుడే, హైదరాబాద్: ‘గేమ్ ఛేంజర్’.. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం. కియారా అడ్వాణి హీరోయిన్. ఇందులోని పాటలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వాటిలో ఒకటైన ‘నానా హైరానా’ ఫుల్ వీడియో సాంగ్ తాజాగా విడుదలైంది. ఇన్ ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఈ పాట కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.