అక్షర టుడే ఇందూరు: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల టాస్క్ ఆధ్వర్యంలో సోమవారం ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించారు. స్టార్ పవర్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ కంపెనీలో టీం లీడర్, సిస్టమ్ ఆపరేటర్, ప్రాసెస్ అసోసియేటెడ్ తదితర విభాగాల్లో ప్రతిభ గల 12 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.రామకృష్ణ, శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొన్నారు.