అక్షరటుడే, వెబ్ డెస్క్: పిడుగుపడి నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన కురుమ కృష్ణమూర్తి(22) శుక్రవారం రాత్రి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణమూర్తి రోజు మాదిరిగానే గొర్రెలను మేపేందుకు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. సాయంత్రం సమయంలో పిడుగు పడి మృతి చెందాడు. రాత్రి కావడంతో గొర్రెలు రోజూ మాదిరిగానే ఇంటికి చేరుకున్నాయి. కానీ, కృష్ణమూర్తి రాకపోయేసరికి అనుమానం వచ్చిన కుటుంబీకులు అతనికి ఫోన్ చేశారు. ఫోన్‌ కలవకపోవడంతో కుటుంబీకులు, గ్రామస్థులు అటవీ ప్రాంతానికి వెళ్లి గాలించగా పిడుగు పడి మృతి చెందినట్లు గుర్తించారు.