అక్షరటుడే, వెబ్డెస్క్: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాస్త ధర తగ్గితే కొందామని అనుకుంటున్న వారికి షాక్ ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పసిడి ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే పెరిగితే రెండు మూడు రోజుల్లో తులం బంగారం రూ.90 వేలు దాటే అవకాశం ఉంది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.88,530 పలుకుతోంది. 22 క్యారెట్ల ధర రూ.81,980గా ఉంది.