అక్షరటుడే, వెబ్డెస్క్: పసిడి పరుగులు ఆగడం లేదు. శుక్రవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,310 పెరిగి రూ.84,330కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,200 పెరిగి రూ.77,300 పలుకుతోంది. వెండి కిలో రూ.వెయ్యి పెరిగి రూ.1,07,000గా ఉంది.