అక్షరటుడే, కామారెడ్డి: తనకు తెలియకుండా తన తండ్రి పేరున ఉన్న భూమిని సొంత సోదరి పట్టా చేసుకున్నారని దోమకొండ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన గొర్రె పద్మ వాపోయారు. సోమవారం ఆమె ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. లింగాపూర్ గ్రామంలో తన తండ్రి పడిగే నర్సయ్య పేరున సర్వే నంబర్ 314/3/1 లో 0.34 గుంటలు సర్వే నంబర్ 315/7b లో 0.19 గుంటల భూమి ఉందని, తన తల్లి పడిగే మనెవ్వ కూడా మృతి చెందడంతో తండ్రి పేరున ఉన్న భూమి మొత్తాన్ని సోదరి తన పేరిట అక్రమంగా పట్టా చేసుకుందని తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది.