అక్షరటుడే, కామారెడ్డి : ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా అధికారులకు వివరాలివ్వాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సర్వేలో భాగంగా ఆదివారం షబ్బీర్ అలీ నివాసంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో సమక్షంలో వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.