అక్షరటుడే, బాన్సువాడ : మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో స్టాళ్లను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ పరిశీలించారు. లాభసాటి వ్యవసాయం, ఉద్యాన పంటలు, పంటల సాగు, మార్కెటింగ్ మెలకువలు, తదితర అంశాలను నిర్వాహకులు వివరించారు. వ్యవసాయ అధికారులు రైతులకు సాగు మెలకువలు, ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించిన తీరు బాగుందన్నారు.