అక్షరటుడే, వెబ్డెస్క్: కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. నీటి పారుదల సౌకర్యాలు, గోదాముల నిర్మాణం చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ప్రయోగాత్మకంగా వంద జిల్లాల్లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలు చేస్తామని ప్రకటించారు. పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామని ప్రకటించారు. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కంది, మినుములు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పత్తి రైతుల ప్రయోజనం కోసం జాతీయ కాటన్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.