అక్షరటుడే, కామారెడ్డి టౌన్: కామారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీన్ 27వ సారి రక్తదానం చేశారు. కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రిలో అనీమియాతో బాధపడుతున్న లక్ష్మికి బి పాజిటివ్ రక్తం అవసరమైంది. కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, పుట్ల అనిల్ కుమార్, వెంకటరమణ పాల్గొన్నారు.