అక్షరటుడే, కోటగిరి: తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రుద్రూర్‌లోని మండల కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు నర్సింలు, గంగారాం, సాయిలు, శంకర్, సాయవ్వ, లింగవ్వ, తదితరులు పాల్గొన్నారు.