
అక్షరటుడే, వెబ్‌డెస్క్ India Vs New Zealand : ఈ రోజుల్లో క్రికెట్‌ని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. క్రికెట్‌కి సంబంధించి ఏ అప్‌డేట్ మిస్ కారు. ఎన్ని ముఖ్యమైన పనులున్నా క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. మాములు మ్యాచ్‌లనే మిస్ కాకుండా చూసే క్రికెట్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ని ఎలా మిస్ అవుతారు. అందులో మన ఇండియా మ్యాచ్ ఆడుతుంది అంటే అస్సలు మిస్ కారు. ఈ మ్యాచ్ ప్రాధాన్యతను గుర్తించిన ఓ వరుడు (పెళ్లి కుమారుడు) తన స్నేహితుల కోసం పెళ్లి మండపంలోనే మ్యాచ్ లైవ్ చూసేందుకు పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశాడు.
ఇంకేముంది వివాహ వేడుకకు వచ్చిన అతిథులతో పాటు వరుడి స్నేహితులు కూడా మ్యాచ్‌ను వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాక్- భారత్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వీక్షించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో ఎల్‌ఈడీ తెరను ఏర్పాటు చేశాడు. దీంతో వారి పెళ్లికి హాజరైన బంధుమిత్రులంతా ఓ వైపు పెళ్లి వేడుక చూస్తూనే.. మరోవైపు ఇండియా-పాక్ పోరును వీక్షించి అరుదైన అనుభూతిని పొందారు.
ఇప్పుడు అదే రీతిలో ఇందూరు నగరంలోని కంఠేశ్వర్ లక్ష్మి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన పెళ్లిలో ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ని ప్రదర్శించారు. పెళ్లి ముగియగానే పెళ్లికొడుకు తరపు బంధువులు.. స్నేహితులు ఇండియా – న్యూజిలాండ్ మ్యాచ్ తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. భారత బౌలర్లు.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీస్తుంటే ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.. కొందరైతే పెళ్లి తంతును మర్చిపోయి పూర్తిగా క్రికెట్ స్కీన్‌కే అంకితమైపోయారు.