అక్షరటుడే, ఇందూరు: టీజీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు సోమవారం ముగిశాయి. ఉదయం నిర్వహించిన పరీక్షకు మొత్తం 19,855 మంది అభ్యర్థులకు గాను 8,915 మంది హాజరయ్యారు. 10,940 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 8,911 మంది పరీక్ష రాయగా.. 10,944 మంది గైర్హాజరయ్యారు. మొదటి రోజుతో పోలిస్తే రెండోరోజు మరింత హాజరు శాతం తగ్గింది.

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాజరుశాతం అంతంత మాత్రంగానే నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కేంద్రాల వద్ద వసతులపై ఆరా తీశారు. అయితే రెండో రోజు అభ్యర్థుల హాజరు వివరాలు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. టీజీపీఎస్సీ నుంచి వివరాలు ఇవ్వొద్దని సమాచారం ఉందని అధికారులు బదులిచ్చారు.