అక్షరటుడే, జుక్కల్: రైతుబంధు పథకం అమలులో రైతులందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని గున్కుల్ సొసైటీ ఛైర్మన్ వాజిద్ అలీ కోరారు. రైతుబంధు అమలు కోసం మండలంలోని మహమ్మద్‌నగర్‌లోని రైతు వేదికలో మంగళవారం సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకట్ రెడ్డి అధ్యక్షతన రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని పలువురు రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పదెకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే అందజేయాలని మరికొంత మంది రైతులు కోరారు. రైతుబీమా పథకాన్ని 75 ఏళ్లు ఉన్న రైతుకు అందించాలని కొందరు రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సేకరించిన రైతుల అభిప్రాయాలను మినిట్స్ లో నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి అమరప్రసాద్, వైస్ ఛైర్మన్ నర్సింలు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మల్లయ్య గారి ఆకాశ్, సీఈవో రాములు పాల్గొన్నారు.