అక్షరటుడే, ఇందూరు : విద్యార్థినులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని గైనకాలజిస్ట్ అంకం భానుప్రియ పేర్కొన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం లయన్స్‌క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలను రక్తహీనత వేధిస్తోందన్నారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నరేశ్, లయన్స్ జోన్ ఛైర్మన్ జిల్కర్ విజయానంద్, ఉపాధ్యక్షుడు పొలాస సత్యనారాయణ, కార్యదర్శి రవీంద్రనాథ్‌గుప్తా, కోశాధికారి రాఘవేంద్రబాబు, పూర్వాధ్యక్షుడు గంగాదాస్, పాలిటెక్నిక్ కళాశాల అలుమ్ని అధ్యక్షుడు బాల్‌నర్సయ్య, లెక్చరర్ భారతి తదితరులున్నారు.