అక్షరటుడే, ఇందూరు: ఎందరో వీరుల త్యాగ ఫలితంతోనే స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయంటే కారణం దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలేనని పేర్కొన్నారు. తల్లిదండ్రులు దేశభక్తిని పెంపొందించే విధంగా తమ పిల్లలను పెంచాలన్నారు. ఛత్రపతి శివాజీ, చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్, అల్లూరి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మోదీ పాలనలో ప్రపంచ దేశాలకే పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి భారత్ చేరుకుందని పేర్కొన్నారు. ర్యాలీలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, పోతనకర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.