అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ కార్యాలయం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర నాయకుడు భూమయ్య మాట్లాడుతూ.. రేషన్ కార్డు, ఆధార్ అనుసంధానం గడువు పొడిగించాలని కోరారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓమయ్య, రాజేశ్వర్, రఘురాం, నర్సింగ్ రావు, సాయిలు, అనిల్, రమేష్, అంజలి, కవిత, సాయికిరణ్, శ్రీను పాల్గొన్నారు.