అక్షరటుడే, హైదరాబాద్: రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన క్షేత్రంలో గ్రేప్ ఫెస్టివల్ జరుగుతోంది. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా ద్రాక్ష మేళాకు సందర్శకులు తరలి వస్తున్నారు. జంట నగరాల నలుమూలల నుంచి చిన్నారులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, మహిళలు తరలివచ్చి క్షేత్రం అంతా కలియ తిరుగుతూ ఆస్వాదిస్తున్నారు. ఈనెల 19న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ పది రోజుల పాటు కొనసాగనుంది.