అక్షరటుడే, న్యూఢిల్లీ: పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. మహాకుంభ్ మేళా తొక్కిసలాటపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడం, బడ్జెట్ ప్రసంగాన్ని వాకౌట్ చేయడం.. తదితర కారణాలతో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో సభ వాయిదా పడింది.