అక్షరటుడే, బాన్సువాడ: కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం పట్టణంలో జరిగిన పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు నియంతృత్వ, కుటుంబ పాలన సాగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇచ్చిన హామీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేశామని, ఎంపీ ఎన్నికల తర్వాత మరో రెండింటిని పూర్తి చేస్తామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పేర్కొన్నారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, జిల్లా అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్ రావు, నార్ల రత్న కుమార్, మాసాని శ్రీనివాస్ రెడ్డి, నార్ల సురేష్, రాజిరెడ్డి, పాత బాలు తదితరులు పాల్గొన్నారు.