అక్షరటుడే, వెబ్ డెస్క్: అడవి కాకరకాయ (బోడ కాకర) కూరంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.. ప్రతి యేటా వానాకాలం ప్రారంభంలో ఇవి లభ్యమవుతాయి. ఎంతో ఇష్టంగా తినే బోడ కాకరకాయకు ఎంత రేటు ఉన్న సరే చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలని ప్రజలు రేటు ఎంతైనా వెనకడుగు వేయరు. అయితే ప్రస్తుతం ఇందూర్ మార్కెట్లో అడవి కాకరకాయలు దొరుకుతున్నాయి. కానీ వీటి ధరలు మాత్రం చికెన్, మటన్‌తో పోటీపడుతున్నాయి. కిలో 500 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూల్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండడంతో ధరలు ఈసారి పెంచామని వ్యాపారులు చెబుతున్నారు.