అక్షరటుడే, బాన్సువాడ: నసురుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపడుతుండడంతో భారీ వర్షానికి రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి క్రింది నుంచి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో బోధన్-నిజామాబాద్ నుంచి బాన్సువాడకు రాకపోకలు ఆగిపోయాయి. రహదారి వెడల్పులో భాగంగా ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తుండగా.. కింది నుంచి తాత్కాలికంగా రోడ్డు వేశారు. కాగా శనివారం కురిసిన భారీ వర్షానికి ఈ మార్గం పూర్తిగా నీట మునిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.