అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాధితులు ఆర్మూర్ మున్సిపల్, కలెక్టర్ కార్యాలయంలోని హెల్ప్ లైన్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది చేరుకొని వరద నీరు రాకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది.