అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఏపీలో ట్రాఫిక్‌ నియమాలపై ఏపీహైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రాఫిక్‌ చలాన్‌ కట్టని వాహనదారుల ఇళ్లకు విద్యుత్‌, నీళ్లు సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో హెల్మెట్‌ ధరించకపోవడంలో 667 మంది మృత్యువాత పడ్డారని ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఏపీ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు డ్రైవర్లు ఎవరు సీటు బెల్టులు పెట్టుకోవడంలేదని, తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్‌ బెల్ట్‌ పెట్టుకుంటున్నారని అక్కడ చట్టనిబంధనలు కఠినంగా అమలు చేస్తారని పిటిషనర్‌ కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఠాకూర్‌ సింగ్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తమ విధులు నిర్వర్తించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.