అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: నిజామాబాద్‌, బోధన్‌ కోర్టుల్లో న్యాయమూర్తుల నివాసాల నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు కె సురేందర్‌, అలిశెట్టి లక్ష్మీనారాయణ వర్చువల్‌గా క్వార్టర్స్‌ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సునీత కుంచాల, జిల్లా 5వ అదనపు న్యాయమూర్తి రవికుమార్‌, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌, న్యాయమూర్తులు పాల్గొన్నారు.