అక్షరటుడే, బాన్సువాడ: న్యాయస్థానాలు దేవాలయాలతో సమానమని, ఇక్కడ బాధితులందరికీ న్యాయం జరుగుతుందని హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్ రావు, లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూతన భవన నిర్మాణానికి శనివారం వారు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కోర్టు పరిధిలో పెండింగ్​లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ జడ్జి టీఎస్​పీ భార్గవి, డీఎస్పీ సత్యనారాయణ, బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.