అక్షరటుడే, వెబ్‌డెస్క్: China | హిందీ చీనీ భాయి భాయి అనేది భారత్(Bharath), చైనాల మధ్య స్నేహ సహకారాలను సూచించే నినాదం. ఇది స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అప్పటి పాలకులు ఇచ్చిన నినాదం. తర్వాతి కాలంలో రాజకీయ, సరిహద్దు వివాదాలు, చైనా కవ్వింపు చర్యలతో ఈ నినాదానికి కాలం చెల్లింది. ఇటీవలి కాలంలో భారత్, చైనా(China)ల మధ్య ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. కానీ అమెరికా America ప్రారంభించిన ట్రేడ్ వార్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా.. భారత్ విషయంలో తాత్కాలికంగానైనా తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. యూఎస్‌ను ఎదుర్కొనేందుకు మనకు స్నేహ హస్తాన్ని చాస్తోంది. భారత్‌తో సహా పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించారు.
China | అక్కడి లోటును ఇక్కడ పూడ్చుకోవడానికి..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(Trump) ఎన్నికైనప్పటినుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ reciprocal tariffs గురించి ప్రస్తావిస్తుండడంతో ముందుగానే చైనా అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా భారత దేశంతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను economic and trade relations మెరుగుపరచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. అమెరికా సుంకాలతో వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి మన దేశాన్ని స్ట్రాటజిక్ పార్ట్‌నర్(Strategic partner)గా చూస్తూ వాణిజ్యపరమైన అంశాలపై కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చింది.
మన దేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం సరిహద్దు వివాదాన్నీ తాత్కాలికంగా temporarily పక్కనపెట్టింది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడం కోసం భారత్, చైనాల India and China మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఎల్‌వోసీ(LOC) వద్ద 2020 నాటి యథాతథ స్థితిని కొనసాగించడానికి అంగీకరించింది. విదేశీ ముఖ్యంగా భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీసాల జారీ ప్రక్రియను visa issuance process సులభతరం చేసింది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయులకు 85 వేలకుపైగా వీసాలను జారీ visa issuance చేసినట్లు మన దేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ తెలిపారు. ‘చైనాను సందర్శించాలనుకునే భారత మిత్రులకు స్వాగతం. సురక్షిత, స్నేహపూర్వక, స్ఫూర్తిమంతమైన చైనాను అన్వేషించండి’ అంటూ ఆయన తన ‘X’ ఖాతాలో ‘X’ account ఇటీవల పోస్ట్ చేశారు. ఆయన గతనెలలోనూ ఇలాంటి పోస్టే పెట్టడం గమనార్హం.
China | ఆచితూచి వ్యవహరిస్తున్న భారత్..
Americaతో ట్రేడ్ వార్‌లో నష్టపోకుండా ఉండేందుకు భారత్‌తో సంబంధాలను మెరుగు పరచుకోవడానికి చైనా China ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల మన దేశ ఆర్థిక వృద్ధిని ప్రశంసించింది. తాజాగా అమెరికాను ఎదుర్కొనేందుకు దక్షిణాసియా దేశాలు మరింత సహకరించుకోవాల్సిన అవసరం ఉందని డ్రాగన్ కంట్రీ Dragon Country పేర్కొంది. యూఎస్ టారిఫ్‌ల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి రెండు అతిపెద్ద దేశాలు ఒక్కటిగా నిలబడాలని భారత్‌ను india కోరింది. వాణిజ్య సమతుల్యతపైనా డ్రాగన్ కంట్రీ దృష్టి సారించింది. ద్వైపాక్షిక వాణిజ్యంలో అసమతుల్యతను తగ్గించేందుకోసం భారత్‌నుంచి ఎక్కువ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసింది. యూఎస్‌ను ఎదుర్కొనేందుకు చైనా China మన దేశ మార్కెట్‌ను అవకాశంగా చూస్తోంది. అయితే మన దేశం మాత్రం తొందరపడడం లేదు. రెండు దేశాలతోనూ ఆచితూచి వ్యవహరించే ధోరణినే కొనసాగిస్తోంది. అటు అమెరికాతో బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్(Bilateral Trade Agreement) కోసం చర్చలు జరుపుతూనే ఇటు చైనాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.