అక్షరటుడే, ఇందూరు: బాలోత్సవ్‌లో జెడ్పీహెచ్‌ఎస్‌ బోర్గాం(పి) విద్యార్థులు నాలుగు బహుమతులు సాధించారని హెచ్‌ఎం శంకర్‌ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ప్రెసిడెన్సీ పాఠశాలలో నిర్వహించిన బాలోత్సవ్‌లో విద్యార్థులు భరతనాట్యం, జానపద నృత్యం, నాటక ప్రదర్శనలో ప్రతిభ చూపి బహుమతులు సాధించారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి బహుమతులను అందజేశారని ఆయన తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు సుమిష, లాస్య, ధీరజ్‌ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. బాలోత్సవ్‌లో జిల్లావ్యాప్తంగా 150కి పైగా ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు పాల్గొన్నాయి.