అక్షరటుడే, బాన్సువాడ: మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడవాలని వసతిగృహ సంక్షేమాధికారిణి విజయభారతి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం “బిర్సా ముండా” జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “బిర్సా ముండా” జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, సుజాత, అనసూయ, కవిత, బిందు, విజయలక్ష్మి, శిరీష, సంధ్య, భారతి, తదితరులున్నారు.