అక్షరటుడే, వెబ్‌డెస్క్: దాదాపు 300 మంది బాధితుల న్యూడ్ టేపులు న్యూస్ టీవీ వాళ్లకు ఎలా అందాయి..? ప్రముఖ చానల్ వద్ద లైంగిక వేధింపుల టేపుల ‘హార్డ్ డిస్క్’ ఎందుకు ఉందంటూ.. రేవతి అనే మహిళ ఎక్స్ వేదికగా నిలదీసిన పోస్ట్‌ను కేటీఆర్ మంగళవారం షేర్ చేశారు. దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జీవితాలను, కుటుంబాలను నాశనం చేసే ఇంత ముఖ్యమైన ‘హార్డ్ డిస్క్’ను పోలీసులు ఓ మీడియా కంపెనీకి ఎలా అప్పగించారని ప్రశ్నించారు. ఈ హార్డ్ డిస్క్ కపటమైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే.. బాధితుల గుర్తింపులు కూడా బయటపడితే.. సమాజంలో వారు జీవితాలకు ముగింపు అవుతుందన్నారు. ఇంత జరుగుతుంటే మహిళా కమిషన్ ఏమి చేస్తోందని నిలదీశారు. మహిళా మంత్రులు ఏమి చేస్తున్నారని.. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.