అక్షరటుడే, కామారెడ్డిటౌన్: హస్త కళాకారులు వ్యాపార లక్షణాలను అలవర్చుకోవాలని, తద్వారా ఆర్థికంగా రాణించాలని హైదరాబాద్ అభివృద్ధి అధికారి గౌతం దత్తా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో డెవలప్‌మెంట్ కమిషనర్(హస్త కళలు), కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో, ఏపీపీసీ ఆధ్వర్యంలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పీడీ సుధీర్ కుమార్, శ్యామల, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.