అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఈనెల 4, 5, 7, 11వ తేదీల్లో హైదరాబాద్, ముంబయి, న్యూదిల్లీ, కోల్కతాలోని ఈసీఐఎల్ కార్యాలయాల్లో నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

పోస్టు, ఖాళీల వివరాలు..

ప్రాజెక్ట్ ఇంజినీర్ 20, టెక్నికల్ ఆఫీసర్ 26, ఆఫీసర్ 2, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ అండ్ అసిస్టెంట్ ఇంజినీర్ 13 పోస్టులున్నాయి.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత. పని అనుభవం.

రెమ్యూనరేషన్ : నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్ కు రూ.45,000 – రూ.55,000. టెక్నికల్ ఆఫీసర్/ ఆఫీసర్ కు రూ.25,000 – రూ.31,000. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ కు రూ.24,500 – రూ.30,000.

ప్రాజెక్ట్ లొకేషన్: ఈస్ట్ జోన్ (కోల్కతా), నార్త్ జోన్ (న్యూదిల్లీ), వెస్ట్ జోన్ (ముంబయి), హెడ్ క్వార్టర్స్ (హైదరాబాద్).

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.