అక్షరటుడే, వెబ్​డెస్క్​: అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ సూచించారు. కొందరు వ్యవసాయ భూముల పేరుతో ప్లాట్లను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఫీజు కట్టి అనుమతులు పొందాకే లేఅవుట్​ చేయాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి ప్లాట్లను కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని చెప్పారు.