అక్షరటుడే, ఆర్మూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను వెంటనే అమలు చేయాలని ఐఎఫ్‌టీయూ శ్రామిక స్పందన రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, రూ.4016కు పింఛన్ పెంపు వంటి హామీలు అమలు చేయాలన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు, కళాకారులకు భృతి, కొత్త రేషన్ కార్డులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు తదితర హామీలు నెరవేర్చాలని కోరారు. హామీల అమలు కోసం ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భారత రైతు కూలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సయ్యద్ మహమూద్, నాయకులు, సంజీవ్, భాను బేగం, బందెల అరుణ, చందన, అఖిల, జయ, సంగీత తదితరులు పాల్గొన్నారు .