అక్షరటుడే, కామారెడ్డి: ఐఎంఏ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర అధ్యక్షుడు డా.ద్వారాకానాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.ద్వారకనాథ్ రెడ్డి, గౌరవ అతిథిగా సంయుక్త కార్యదర్శి సురేంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యుల ఉత్సాహాన్ని, శక్తిని మెచ్చుకున్నారు. అనంతరం మొట్టమొదటి సారిగా రాష్ట్ర క్రీడలు మరియు సాంస్కృతిక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా కామారెడ్డి ఐఎంఏ సెక్రెటరీ డా.అరవింద్ కుమార్ ను నియమించారు. అంతకు ముందు నిర్వహించిన పోటీల్లో పురుషుల సింగిల్స్ విభాగంలో మొదటి స్థానంలో డా.కమల్, 2వ స్థానంలో డా.శ్రవణ్, పురుషుల డబుల్స్ విభాగంలో మొదటి స్థానంలో డా.రమేష్ బాబు, డా.కమల్, 2వ స్థానంలో డా.ప్రవీణ్, డా.శ్రవణ్ నిలిచారు. మహిళల సింగిల్స్ విభాగంలో మొదటి స్థానంలో హేమా వెంకటేశ్వర్లు, 2వ స్థానంలో హేమ మాలతి, డబుల్స్ విభాగంలో హేమ మాలతి, ఎన్ హేమ, మొదటి స్థానంలో, 2వ స్థానంలో స్వసా, ఎన్. నిషాత్ నిలిచారు. వీరికి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షురాలు రాధా విజయలక్ష్మి, సెక్రటరీ డా.అరవింద్, కోశాధికారి పవన్, సీనియర్ వైద్యులు వెంకటేశ్వర్ గౌడ్‌, డా.రమణ, డా.మల్లికార్జున్‌, డా.దినేష్‌, డా.వెంకట్‌ పాల్గొన్నారు.