అక్షరటుడే, భిక్కనూరు: జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, తద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ రమేష్ చైతన్య అన్నారు. సోమవారం భిక్కనూరు మండలం జంగంపల్లిలోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన ‘జీవితంలో లక్ష్యాలు–సవాళ్లు’ అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. చదువుపై ఏకాగ్రత, క్రమశిక్షణ, మంచి అలవాట్లతో అనుకున్న లక్ష్యాలు చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విమల, అధ్యాపకులు పాల్గొన్నారు.