అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆటోనగర్‌లో చోరీ జరిగింది. ఆరో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్‌లో తాళం వేసిన ఓ ఇంట్లో మంగళవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని ఎనిమిదిన్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.