అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌: భద్రాచలం జిల్లాలో ఎక్సైజ్‌ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఈ ఘటనలో రూ.కోటికి పైగా విలువ చేసే 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పది మందిని అరెస్టు చేసి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా.. గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన వారిలో నిజామాబాద్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ కొడుకు మునావర్‌ ఉన్నట్లు తెలిసింది. మునావర్ గత పదేళ్లుగా ఒడిశా-ఏపీ సరిహద్దు నుంచి గంజాయి తెచ్చి వ్యాపారం చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. కాగా.. కొన్నాళ్లుగా నిజామాబాద్ నగరంలో ఎంఐఎం పార్టీ నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న మునావర్ గంజాయి కేసులో చిక్కడం తీవ్ర చర్చకు దారితీసింది.