అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఇన్‌ఛార్జి సీపీ సింధు శర్మ ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే ఏసీపీని సంప్రదించాలన్నారు. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే నేరుగా సీపీ ఆఫీస్‌లోని సెంట్రల్ కంప్లయింట్ సెల్ నంబర్ 87126 59888కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.