అక్షరటుడే, జుక్కల్: మహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో తాగునీటి కోసం గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామంలో ఉన్న బోరు బావులు, చేతి పంపులు పనిచేయడం లేదు. భగీరథ నీరు సరఫరా కాక అటు బోరు బావులు పనిచేయక తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొలాల నుంచి నీటిని తెచ్చుకొంటున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి గ్రామపంచాయతీ ట్యాంకరును తీసుకురావడంతో నీటి కోసం గ్రామస్తులు పోటీపడి పట్టుకున్నారు.