అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ఇంటింటికి వచ్చి కూరగాయలు, ప్లాసిక్‌ వస్తువులు, మసాలాలు విక్రయించడం చూశాం.. కానీ ఆ గ్రామంలో మాత్రం ఇంటింటికి తిరుగుతూ కల్లు విక్రయిస్తున్నారు. ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా.. భిక్కనూరు మండలం కాచాపూర్‌లో ఇద్దరు వ్యక్తులు కారులో ఇంటింటికి వెళ్తూ కల్లు అమ్ముతున్నారు. ‘రండి బాబు రండి.. మీ వాడకట్టుకొచ్చినం.. మీ ఇంటి కాడికొచ్చినం.. కల్లు కొనుక్కోవాలయ్యా.. అంటూ’ మైక్‌లో అనౌన్స్‌ చేస్తుండడంతో ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. బట్టీకి వెళ్లి కల్లు సీసాలు తెచ్చుకునే రోజుల నుంచి.. ఇంటి వద్దకే వచ్చే రోజులచ్చాయంటూ ఆ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.