అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ముందడుగు పడింది. రాష్ట్రంలో రైల్వేలైన్లు లేని 8 ప్రాంతాలను కలుపుతూ రూ.15,755 కోట్లతో రైల్వే నెట్‌వర్క్‌ విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది.